Fri Dec 05 2025 15:39:25 GMT+0000 (Coordinated Universal Time)
అధికారులకు సెలవులు రద్దు
అధికారులకు సెలవులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అధికారులకు సెలవులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు ఎవరూ సెలవు తీసుకోవద్దని కోరింది. అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉండాలని సూచించింది. ప్రధానంగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, వైద్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకూ పనిచేయాలని కోరారు.
వరద ప్రాంతాల్లో...
వరద ప్రాంతాలో సహాయక చర్యలు పర్యవేక్షించాలని రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ అవసరం వచ్చినా వెంటనే అధికారులు స్పందించాలని కోరారు. అధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ సహాయక చర్యలలో పాల్గొనాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Next Story

